digvijay singh: ఎన్నికల సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్

  • రెండు సార్లు సీఎంగా చేశా
  • మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు
  • రాహుల్ ఏ బాధ్యతలు అప్పగించినా.. స్వీకరిస్తా

మరో ఆరు నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు తాను పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా పని చేశానని... మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష తనకు లేదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. పార్టీ వర్గాలను ఏకతాటిపై నడిపించి, బీజేపీని ఓడించడమే తన అభిమతమని చెప్పారు. తమ అధినేత రాహుల్ గాంధీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు నర్మదా నది పరిరక్షణ కోసం ఆరు నెలల పాటు ఆయన చేపట్టిన 3,100 కిలోమీటర్ల పాదయాత్ర ఇటీవలే ముగిసింది. ఓంకారేశ్వర్ ఆలయంలో ఆయన యాత్రను ముగించారు. ఈ సందర్భంగా నర్మదా ఘాట్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో అభిషేకాలు చేశారు. 

More Telugu News