ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు

  • ఆన్ ఎన్ఎక్స్ టీ మొబైల్ పై 6,000 తగ్గింపు 
  • కొత్త ధర రూ.11,900
  • మరిన్ని ఉత్పత్తులపైనా ఇదే విధమైన తగ్గింపులు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్ శాంసంగ్ కార్నివాల్ పేరిట ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకూ ప్రత్యేక విక్రయాలు చేపట్టింది. ఇందులో భాగంగా శాంసంగ్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలు, పలు ఆఫర్లను అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలుకు వీలు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపునకు గాను కనీస కొనుగోలు విలువ రూ.5,990 ఉండాలన్న షరతు విధించింది. అలాగే, గరిష్ట తగ్గింపు రూ.1,000కి పరిమితం చేసింది.

శాంసంగ్ కార్నివాల్ లో భాగంగా మొబైల్స్, టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, ట్యాబ్లెట్లపై ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ ఎస్8 బుర్గుండీ కలర్ మొబైల్ ను ప్రీ ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. దీని ధర రూ.49,990. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధరను ఏకంగా 7,000 తగ్గించి రూ.34,900గా ఫిక్స్ చేసింది. గెలాక్సీ ఆన్ ఎన్ఎక్స్ టీ (3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ) ధరను రూ.6,000 తగ్గించి దాని ధర రూ.11,900గా ఖరారు చేసింది. గెలాక్సీ జే3 ప్రో ధరను రూ.1,500 తగ్గించింది.
Go Back to Shorts
samsung
flipkart
discounts

More Telugu News