YSRCP: ఆందోళనకరంగా వైయస్ అవినాష్, మిథున్ రెడ్డిల ఆరోగ్యం

  • ఆరో రోజుకు చేరిన వైసీపీ ఎంపీల ఆమరణదీక్ష
  • విషమిస్తున్న అవినాష్, మిథున్ ల ఆరోగ్యం
  • ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఆమరణదీక్ష చేపట్టాలని వైకాపా ఎంపీల దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఇప్పటికే సీనియర్ ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువ ఎంపీలైన వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్య పరిస్థితి విషమించింది. వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించిన రామ్ మనోహర్ లోహియా ఆసుప్రతి వైద్యులు మాట్లాడుతూ, వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. సమయం గడిచే కొద్దీ వీరి ఆరోగ్యం మరింత విషమిస్తుందని చెప్పారు. వీరి బీపీ, షుగర్ లెవెల్స్, పల్స్ రేటు పడిపోయాయని వెల్లడించారు.
YSRCP
mps
hunger strike
avinash reddy
mithun reddy

More Telugu News