Sri Reddy: మీరు పోతే శని వదిలిపోతుంది: అనూహ్యంగా దిల్ రాజును టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

  • దిల్ రాజు చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారు
  • ఆడపిల్లలను బతకనిద్దామని వేడుకోలు
  • బతికుండగానే మారాలని ఫేస్ బుక్ లో పోస్టు
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి, అనూహ్యంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేసుకుంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని వ్యాఖ్యానించింది. ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని చెప్పింది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ "కుళ్లు రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ... ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా... టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి" అని వ్యాఖ్యానించింది.

 తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదని మరో పోస్టులో చెప్పింది. కాగా, ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పలువురి పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా ట్వీట్లపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంతకాలానికి శ్రీరెడ్డి పోరాటం మరో మలుపు తిరిగిందని, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు కనకదుర్గగా మారిందని కామెంట్లు వస్తున్నాయి.

Sri Reddy
Dil Raju
Facebook
Casting Couch

More Telugu News