క్వీన్ ఎలిజబెత్ మహ్మద్ ప్రవక్త వారసురాలు!: చరిత్రకారుడు అబ్దుల్-హమీద్ అల్-అవానీ
- క్వీన్ ఎలిజబెత్ మహ్మద్ ప్రవక్త 43వ తరం సంతానం
- మహ్మద్ ప్రవక్త కుమార్తె ఫాతిమా సంతానమే క్వీన్ ఎలిజబెత్
- స్పెయిన్ ను పాలించిన అరబ్ రాజులు కూడా క్వీన్ ఎలిజబెత్ పూర్వీకులే
ఈ విషయాన్ని తొలిసారిగా 1986లో ఓ ప్రచురణ సంస్థ అధినేత హరాల్డ్ బ్రూక్స్-బేకర్ నిర్ధారించారు. తాజాగా దానిని మొరాకో పత్రిక అల్-ఒస్బుయ్ ప్రచురించింది. మొరాకో, అండెలాసియా, ఐరోపాలో పలు సామ్రాజ్యాలను పాలించిన రాజులు కూడా మహ్మద్ ప్రవక్త రక్తసంబంధీకులని చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆయన అధ్యయనంలో ప్రతిపాదించిన ప్రకారం క్వీన్ ఎలిజబెత్ (91)-2 మొరాకో రాజు మహమ్మద్-6, జోర్డాన్ రాజు అబ్దుల్లా-2లకు బంధువు అవుతారని దీనిపై తాజాగా అధ్యయనం చేస్తున్న చరిత్రకారులు చెబుతున్నారు.