ramsethu: రామసేతుపై అధ్యయనం నిర్వహించకూడదని ఐసీహెచ్ఆర్ నిర్ణయం

  • ఇతరులు చేసినా నిధుల సాయం అందించం
  • ఈ విధమైన అధ్యయనాలకు ఆర్కియలాజికల్ సర్వే
  • మేం సూచన మాత్రమే చేయగలమంటూ ప్రకటన

రామసేతును ఎవరు నిర్మించారన్నదానిపై అధ్యయనం నిర్వహించకూడదని ఐసీహెచ్ఆర్ నిర్ణయం
తీసుకుంది. తమిళనాడు, శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న వారధిని రామసేతుగా పిలుస్తున్న విషయం తెలిసిందే. ఇది మానవ నిర్మితమా లేక సహజంగా ఏర్పడిందా అన్న దానిపై తామ అధ్యయనం నిర్వహించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్) సంస్థ స్పష్టం చేసింది. రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి సహజంగా ఏర్పడిందా లేక నిర్మించినదా అనే దానిపై తాము అధ్యయనం నిర్వహించనున్నట్టు గతేడాది ఇదే సంస్థ ప్రకటన చేసింది. దీనికి భిన్నంగా ఐసీహెచ్ఆర్ నూతన చైర్ పర్సన్ అరవింద్ జమ్ కేద్కర్ మీడియాతోొ మాట్లాడారు. ‘‘ఓ చరిత్రకారుడి నుంచి అధ్యయనం చేపట్టాలన్న ప్రతిపాదన అయితే ఉంది. కానీ, దీనిపై కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారు. వారు చాలా ఆగ్రహంతోనూ ఉన్నారు. దీంతో ఈ అంశంపై మేము అధ్యయనం చేయబోవడం లేదు. అలాగే, వేరెవరైనా చేస్తే వారికి నిధుల సాయం కూడా అందించబోం’’ అని జమ్ కేద్కర్ తెలిపారు. ఈ విధమైన అధ్యయనాలు చేపట్టడానికి ఆర్కియలాజికల్ సర్వే ఉందన్నారు. పరిశీలించాలని మాత్రమే ఐసీహెచ్ ఆర్ సూచన చేయగలదని చెప్పారు.

More Telugu News