Tollywood: ఏపీకి ఏ ఇబ్బంది వచ్చినా సినీ పరిశ్రమ కలిసికట్టుగా స్పందిస్తుంది: దర్శకుడు రాఘవేంద్రరావు

  • తిరుమలలో రాఘవేంద్రరావు
  • ఏపీ ప్రభుత్వానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది
  • ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలి

ఆంధ్రప్రదేశ్ కు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగు సినీ పరిశ్రమ కలిసికట్టుగా స్పందిస్తుందని, అండగా నిలుస్తుందని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

More Telugu News