Srimantudu: 'శ్రీమంతుడు'ని వెనక్కు నెట్టేసిన 'రంగస్థలం'!

  • నాన్ బాహుబలి కలెక్షన్ల రికార్డు
  • యూఎస్ లో టాప్-3 మూవీగా 'రంగస్థలం'
  • కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని అంచనా

గతవారం విడుదలై, సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్న రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' యూఎస్ లో నాన్ 'బాహుబలి' రికార్డులన్నింటినీ తుడిచిపెట్టింది. ఇప్పటివరకూ బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తరువాత మూడో స్థానంలో మహేష్ బాబు 'శ్రీమంతుడు' ఉండగా, 'రంగస్థలం' దాన్ని కిందకు నెట్టేసింది. 'శ్రీమంతుడు' చిత్రం 2.89 మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేయగా, 'రంగస్థలం' తొలి పది రోజుల వ్యవధిలోనే 3 మిలియన్ డాలర్ల మార్క్ ను అధిగమించిందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా మరింత కలెక్షన్లను సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం 4 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేస్తుందని భావిస్తున్నారు.

More Telugu News