Gold Coast: మూడు రోజులు ముగిశాక కామన్వెల్త్‌లో భారత్ స్థానం ఇదీ..

  • మొత్తం ఆరు పతకాలతో నాలుగో స్థానంలో భారత్
  • పతకాలన్నీ వెయిట్ లిఫ్టర్ల ఖాతాలోకే
  • 57 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో శనివారం మూడో రోజు ముగిసే సరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 56 కేజీల విభాగంలో పి.గురురాజ రజత పతకం సాధించగా, 69 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన దీపక్ లాథర్ కాంస్య పతకం సాధించాడు.  భారత వెయిట్‌ లిఫ్టర్లు సతీశ్ శివలింగం, వెంకట్ రాహుల్ రాగాల భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు అందించారు. 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో శివలింగం పతకాన్ని నిలుపుకున్నాడు. మిజోరంకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చాను  53వ కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. అలాగే మరో వెయిట్ లిఫ్టర్ మిరాబాయ్ చాను కూడా స్వర్ణం సాధించడంతో భారత్ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

భారత్ సాధించిన మొత్తం ఆరు పతకాలు వెయిట్ లిఫ్టర్లు సాధించనవే కావడం గమనార్హం. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 20 స్వర్ణాలు, 17 రజతాలు, 20 కాంస్య పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మొత్తం 32 పతకాలతో ఇంగ్లండ్, 18 పతకాలతో కెనడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్ ఆరు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. ఒకే ఒక్క కాంస్య పతకం సాధించిన పాకిస్థాన్ 17వ స్థానంలో ఉంది.

More Telugu News