Chandrababu: చంద్రబాబూ.. చిత్తశుద్ధి ఉంటే ఈ 7 ప్రశ్నలకు జవాబు చెప్పు: జగన్

  • చంద్రబాబుకు ఏడు ప్రశ్నలను సంధించిన జగన్
  • జవాబులు చెప్పాలంటూ సవాల్
  • మోసం చేస్తున్నారంటూ ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ఏడు ప్రశ్నలను సంధించారు. చంద్రబాబు గారూ, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి జగన్ సంధించిన ఆ ఏడు ప్రశ్నలు ఇవే...

  • 2014 జూన్ తర్వాత ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పటికీ... ప్రత్యేక హోదాపై ఎందుకు లేఖ రాయలేదు?
  • ప్రత్యేక ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటన చేయగానే... అర్ధరాత్రి పూట స్వాగతించలేదా? ఢిల్లీకి వెళ్లి సన్మానించలేదా?
  • హోదా కోసం పట్టుబట్టకుండా వృద్ధి రేటులో ముందున్నామంటూ, 40 లక్షలు ఉద్యోగాలు వచ్చాయంటూ... తప్పుడు సంకేతాలు ఇవ్వలేదా?
  • ప్రత్యేక హోదాపై వైసీపీ ఆందోళనలు చేస్తే నీరుగార్చిన చరిత్ర మీది కాదా? పీడీ యాక్టులు పెడతామంటూ విద్యార్థులను బెదిరించింది మీరు కాదా?
  • వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే... మీరు పెట్టేవారా?
  • కేవలం నల్ల బ్యాడ్జీలు ధరించినంత మాత్రాన ప్రత్యేక హోదా వస్తుందా?
  • మీ స్వార్థం కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా, వారితో దీక్షలు చేయించకపోవడం మోసం కాదా?

More Telugu News