వాయిదా పడినా సభను వీడని టీడీపీ ఎంపీలు... స్పీకర్ పిలుస్తున్నారని చెప్పి, లాబీ తలుపుల మూసివేత!
- సభను వీడకుండా నినాదాలు చేసిన ఎంపీలు
- హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్
- తన చాంబర్ కు పిలిపించుకుని మాట్లాడతానన్న సుమిత్రా మహాజన్
- నమ్మి బయటకు రాగానే తలుపుల మూసివేత
దీంతో వారిని స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుస్తున్నారని, ఆమె చాంబర్ కు వచ్చి చర్చించాలని ఎంపీల వద్దకు వచ్చిన అధికారులు వెల్లడించారు. దీంతో వారంతా బయటకు రాగానే, మరోసారి లోనికి వెళ్లకుండా లోక్ సభ లాబీ తలుపులను అధికారులు మూసివేయించారు. ఆపై టీడీపీ ఎంపీలు సుమిత్రా మహాజన్ కార్యాలయం వద్దకు వెళ్లేసరికి ఆమె వెళ్లిపోవడంతో, తాము మోసపోయామని గ్రహించి, స్పీకర్ చాంబర్ ముందు తెలుగుదేశం ఎంపీలు నిరసనలకు దిగారు.