Salman Khan: సల్మాన్ ఖాన్ కు జైలు శిక్షపై పాక్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు!

  • సల్మాన్ ముస్లిం అయినందునే తీవ్రంగా శిక్ష వేశారు
  • భారత్ లో ముస్లింలను అంటరానివారిగా చూస్తారు
  • ఓ న్యూస్ ఛానెల్ తో పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ 

కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమాన విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ కు జైలు శిక్ష విధించడంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందించారు. జియో న్యూస్ ఛానెల్ తో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ ముస్లిం అయినందునే ఆయనకు జైలు శిక్ష వేశారని, భారత్ లో ముస్లింలను అంటరానివారిగా చూస్తారంటూ ఆరోపణలు గుప్పించారు.

భారత్ లోని అధికార పార్టీ ఏ మతానికి అయితే చెందిందో సల్మాన్ ఆ మతస్థుడైనట్టయితే ఇంత తీవ్రమైన శిక్ష పడి ఉండేది కాదని, కోర్టు కూడా తక్కువ శిక్ష విధించేదంటూ వ్యాఖ్యానించారు. కాగా, సల్మాన్ ఖాన్ ను జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. సల్మాన్ ని సాధారణ ఖైదీలానే పరిగణిస్తామని, ఆయనకు నెంబర్ 106ను కేటాయించినట్టు జైలు అధికారులు తెలిపారు.

More Telugu News