Salman Khan: సెంట్రల్ జైలుకి చేరుకున్న సల్మాన్‌ ఖాన్‌.. జైల్లో ఆశారాం బాపుతో కలిసి ఉండనున్న బాలీవుడ్ హీరో

షార్ట్స్‌లో చూడండి
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దోషిగా తేలడంతో ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ విషయం విదితమే. దీంతో ఆయనను పోలీసులు కోర్టు నుంచి భారీ భద్రత నడుమ జోధ్‌పూర్‌ సెంట్రల్ జైలుకి తరలించారు. కాగా, ఇదే జైలులో 2006లోనూ సల్మాన్‌ ఖాన్‌ ఐదు రోజులు ఉన్నాడు. ఇప్పుడు అదే జైలులో బ్యారక్‌ నంబర్‌ 2లో ఆయనకు జైలు గదిని కేటాయించారు.

ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటోన్న స్వామిజీ ఆశారాం బాపు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఆశారాం బాపుపై 2013లో ఆశ్రమానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అరెస్టు అయిన ఆయన ఐదేళ్లుగా ఇదే జైల్లో ఉంటున్నారని ఓ అధికారి తెలిపారు. మరోవైపు సల్మాన్‌ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Go Back to Shorts
Salman Khan
jail

More Telugu News