Salman Khan: ఆ రోజు కృష్ణ జింకకు నీళ్లు తాగించి, బిస్కెట్లు తినిపించాను: సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు వైరల్

షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్‌లోని ఘోడా ఫార్మ్స్‌లో సెప్టెంబర్‌ 28, 1998న కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌ గతంలో ఈ కేసు గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2009లో ఓ జాతీయ మీడియాతో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఓ స్టోరీ చెప్పాడు.

'హమ్‌ సాత్ సాథ్‌ హై' సినిమా షూటింగ్‌ ముగించుకొని తాను ఆ రోజు తన సహనటులతో బయలుదేరానని అన్నాడు. ఆ సమయంలోనే తమకు కృష్ణ జింకలు ఎదురుపడ్డాయని, దీంతో ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామని అన్నాడు. అదే సమయంలో ఓ జింక పొదలో ఇరుక్కోవడం తాము చూశామని, అది తీవ్రంగా ఇబ్బంది పడుతుండడం చూసి దానిని పొదలోంచి బయటకు తీశానని, అనంతరం దానికి కొన్ని నీళ్లు తాగించామని అన్నాడు. అనంతరం ఆ జింక కొన్ని బిస్కెట్లను తిని అడవిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు. అంతేగానీ, తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Salman Khan
blackbuck case

More Telugu News