g-mat: 'జీమాట్‌’ పరీక్ష సమయం అరగంట కుదింపు!

  • 800 మార్కులకు జరిగే 'జీమాట్' పరీక్ష
  • నాలుగు గంటలపాటు నిర్వహించే పరీక్ష
  • పరీక్షా సమయం 3:30 గంటలకు కుదించిన 'జీమాక్'
'జీమాట్' పరీక్షా సమయం 30 నిమిషాలు  తగ్గిస్తున్నట్టు ఈ పరీక్ష నిర్వహణ మండలి ‘జీమాక్’ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశాల నిమిత్తం ‘గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌ మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జీమాట్‌)’ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

గతంలో 800 మార్కుల స్కోరింగ్ కు నాలుగు గంటలపాటు పరీక్షను నిర్వహించేవారు. దీనిని 30 నిమిషాలు తగ్గించి, 3:30 నిమిషాలు చేశారు. ఏప్రిల్‌ 16 నుంచి నిర్వహించే పరీక్షల నుంచే ఇది అమలవుతుందని ‘జీమాక్‌’ తెలిపింది. క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలను తగ్గించడం మినహా కొత్తగా మార్పులేమీ చేయలేదని, ఈ ప్రభావం మార్కులపై ఉండదని ‘జీమాక్’ స్పష్టం చేసింది.
g-mat
g-mac
exam
time change

More Telugu News