Odisha: తెరచుకున్న పూరీ జగన్నాధుని రత్న భాండాగారం

  • రత్న భాండాగారంలో వెలకట్టలేని సంపద?
  • రెండు గదులను తెరిచి పరిశీలించిన అధికారులు
  • మూడో గదిపై తొలగని సందిగ్ధత
అత్యంత విలువైన, వెలకట్టలేని సంపద దాగుండవచ్చని భావిస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాధుని రత్న భాండాగారం తలుపులు తెరచుకున్నాయి. పూరీ క్షేత్రంలోని సుప్రసిద్ధ ఆలయం కింద ఉన్న ఈ ఖజానా తలుపులు తెరిచిన అధ్యయన బృందం, మొదటి, రెండవ గదుల పరిశీలనను పూర్తి చేసింది.

అయితే, స్వామి సంపద ఉన్నదని భావిస్తున్న మూడో గదిని తెరచే విషయంలో మాత్రం సందిగ్ధత తొలగలేదు. 1980వ దశకంలో ఈ తలుపులు తెరవాలని ప్రయత్నించగా, లోపల నుంచి పాములు బుస కొడుతున్న శబ్దాలు రావడంతో వెనకడుగు వేశారన్న సంగతి తెలిసిందే. ఇక తొలి రెండు గదుల్లో ఏమేం ఉన్నాయన్న దానిపై అధ్యయన బృందం నివేదిక తయారు చేసిన తరువాత దాన్ని బహిర్గతం చేస్తామని అధికారులు వెల్లడించారు.
Odisha
Puri Jagannadh
Puri
Treasure

More Telugu News