rai laxmi: ఈ ఫొటో ప్రత్యేకమైన వ్యక్తి తీశారంటున్న రాయ్ లక్ష్మి!

ప్రముఖ సినీ నటి రాయ్‌ లక్ష్మి ట్విట్టర్ లో ఒక ప్రత్యేకమైన ఫొటోను అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాయ్ లక్ష్మి పంచుకున్న ఫొటో అభిమానులను అలరిస్తోంది. సృజనకి అద్దం పడుతున్న ఆ ఫొటోని తీసింది మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి కావడం విశేషం. షూటింగ్ గ్యాప్ లో కెమెరా చేతబట్టిన ఆయన అద్భుతమైన ఫొటోను తీశారు.

తాను జలపాతం దగ్గర నిలబడి సూర్యుడ్ని మింగేస్తున్నట్టు దిగిన ఆ దృశ్యాన్ని తానే ముచ్చటపడి ఫొటో తీయించుకున్నానని, సినిమా చిత్రీకరణ ఇంత అందమైన లొకేషన్ లో జరుగుతోందని తెలిపింది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
rai laxmi
movie
mammutti

More Telugu News