సౌదీలో కొత్త చట్టం: జీవిత భాగస్వామి ఫోన్ ని దొంగచాటుగా చూస్తే కటకటాలు లెక్కించాల్సిందే!

షార్ట్స్‌లో చూడండి
స్త్రీ సమానత్వం, మహిళ స్వేచ్ఛకు ఊతమిచ్చేలా పలు చట్టాలు చేస్తున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భార్య, భర్త ఎవరైనా తమ జీవిత భాగస్వామి ఫోన్‌ లోని డేటాను దొంగచాటుగా పరిశీలిస్తే దానిని నేరంగా పరిగణిస్తారు.

దీంతో ఈ నేరానికి పాల్పడే వారికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు, 5 లక్షల సౌదీ రియాళ్లు (సుమారు 86.5 లక్షల రూపాయలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ డేటా కీలకంగా మారుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.
Go Back to Shorts
soudi arebia
gender equality
New law

More Telugu News