Supreme Court: ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పును నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

  • అభ్యంతరాలు తెలిపేందుకు రెండు రోజుల గడువు
  • 10 రోజుల తరువాత విచారణ
  • ఎస్సీ, ఎస్టీ చట్టానికి తాము వ్యతిరేకం కాదన్న సుప్రీంకోర్టు
  • అమాయకులకు అన్యాయం జరగొద్దన్నదే ఉద్దేశమని వ్యాఖ్య

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆయా వర్గాల ప్రజలు ఆందోళనలు చేపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును నిలుపుదల చేయాలని వచ్చిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అభ్యంతరాలు తెలిపేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామని, 10 రోజుల తరువాత వాటిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అమాయకులకు అన్యాయం జరగొద్దన్నదే తమ ఉద్దేశమని చెప్పింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సవరణను, తమ ఆదేశాలను సరిగ్గా చదవనివారే ఆందోళన చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

More Telugu News