marriage proposel: తనకు పిల్లనివ్వడానికి అంగీకరించని కుటుంబాన్ని హతమార్చి... శవాలను అడవిలో పారేసిన వివాహితుడు

  • రంభను తనకిచ్చి వివాహం చేయాలని కోరిన వివాహితుడు
  • వివాహం చేసేది లేదని తేల్చిన రామ్ సింగ్ శిర్కా
  • పదునైన ఆయుధాలతో రామ్ సింగ్ కుటుంబాన్ని హతమార్చిన వివాహితుడు
తనతో వివాహానికి అంగీకరించలేదని కుటుంబం మొత్తాన్ని హతమార్చిన వివాహితుడు, వారి శవాలను అడవిలో పారేసిన ఘటన జార్ఖండ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. దాని వివరాల్లోకి వెళ్తే... జార్ఖండ్‌ లోని పశ్చిమ సింగ్‌ భూమ్ జిల్లాలోని తులాసియా గ్రామంలో రామ్‌ సింగ్ శిర్కా, పాను కుయ్ దంపతులు కుమార్తె రంభ (17), కుమారులు కాండే (12), సోన్యా (8) లతో జీవిస్తున్నారు. రంభను తనకు ఇచ్చి వివాహం చేయాలని అదే గ్రామానికి చెందిన వివాహితుడు రామ్ సింగ్ శిర్కాను కోరాడు. దానికి ఆయన నిరాకరించాడు. వివాహితుడికి తన కుమార్తెను ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు.

 దీంతో కక్ష పెంచుకున్న వివాహితుడు, ఈ నెల 14న రామ్ సింగ్ శిర్కా బయటకు వెళ్లిన సమయంలో బంధువులతో కలిసి పదునైన ఆయుధాలతో పాను కుయ్, రంభ, కాండే, సోన్యాలపై దాడి చేసి పాశవికంగా హతమార్చి, గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోని అడవిలో పడేశాడు. అనంతరం ఇంటికి వచ్చే రామ్ సింగ్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని అడివిలో దారికాచి, అవే ఆయుధాలతో అతనిని కూడా హతమార్చి, శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. రామ్ సింగ్ శవం పాడైపోయిన స్థితిలో గ్రామస్థుల కంటబడడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివాహితుడితో సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
marriage proposel
jarkhand
murder

More Telugu News