punjab national bank: ఎలాంటి వదంతులు పట్టించుకోవద్దు: ఖాతాదారులకు పీఎన్బీ విఙ్ఞప్తి

  • పీఎన్బీ ఖాతాదారుల సొమ్ము క్షేమంగా ఉంది
  • ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు
  • ఎలాంటి లావాదేవీలైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో ఆ బ్యాంకు ఖాతాదారులు తమ సొమ్ము భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎన్బీ ఖాతాదారుల ప్రశ్నలకు సదరు అధికారులు స్పందిస్తూ తొలిసారిగా ఓ ప్రకటన చేశారు. పీఎన్బీ ఖాతాదారుల సొమ్ము క్షేమంగా ఉందని, ఎలాంటి వదంతులు పట్టించుకోవద్దని తెలిపింది. ఖాతాదారులు తమ సొమ్మును ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చని, ఎలాంటి లావాదేవీలైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ఖాతాదారుల సేవల పట్ల తాము పూర్తి నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేసింది.  
punjab national bank
customers

More Telugu News