China: నేడు కుప్పకూలే మరో 'స్కైలాబ్' తియాంగాంగ్... సర్వత్రా ఆందోళన!

  • భూమికి 175 కిలోమీటర్ల ఎత్తులో తియాంగాంగ్-1
  • 28 వేల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమణం
  • నేడు భూ కక్ష్యలోకి రానున్న గతితప్పిన స్పేస్ స్టేషన్

అంతరిక్షంలో గతితప్పి భూమివైపు దూసుకువస్తున్న చైనా ఫస్ట్ స్పేస్ స్టేషన్ 'తియాంగాంగ్-1' నేడు భూ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇది ప్రస్తుతం అమెరికా, దక్షిణాఫ్రికాల మీదుగా ఆస్ట్రేలియా వైపు వెళుతోందని, ఆఖరు క్షణంలో దిశను మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనివల్ల మానవాళికి ప్రమాదం ఉండదని, భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, గతంలో భూమిని తాకిన స్కైలాబ్ అనుభవాల నేపథ్యంలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భూమికి సుమారు 175 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ఇది పరిభ్రమిస్తూ, భూమిని సమీపిస్తోంది. ఇది ఎప్పుడు, ఎక్కడ కూలుతుందన్న విషయాన్ని రెండు గంటలకు ముందుగా మాత్రమే వెల్లడించగలమని స్పేస్ సైంటిస్టులు చెబుతున్నారు.

More Telugu News