తెలుగు ప్రజల మనసు గెలిచే ప్రయత్నంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్
- రామ్ చరణ్ మూవీలో ప్రతినాయకుని పాత్ర
- తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నం
- తనతో తెలుగులోనే మాట్లాడాలంటూ యూనిట్ సిబ్బందికి సూచన
తెలుగు భాషను నేర్చుకునేందుకు ఆయన ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. తెలుగులో మాట్లాడాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం షూటింగ్ స్పాట్ కు వచ్చింది మొదలు తనతో తెలుగులోనే మాట్లాడాలంటూ అక్కడున్న వారిని కోరుతుండడం ఆసక్తికరం. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. దీంతో తన పాత్రను మరింత పండించాలనే అభిలాషతో తెలుగుపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన వాక్చాతుర్యం, ఉచ్చారణ చూసి షూటింగ్ సిబ్బంది మెచ్చుకుంటున్నారని సమాచారం.