New Delhi: రైల్వే ప్రత్యేక ప్యాకేజీ.. ఢిల్లీ నుంచి నాలుగు రోజుల జమ్మూ ప్రయాణానికి టికెట్ రెండు లక్షలు!

షార్ట్స్‌లో చూడండి
రైల్వేలకు ఆదరణ పెంచేందుకు వినూత్నమైన ప్యాకేజీలతో రైల్వే శాఖ పలు రైళ్లను నడుపుతోంది. తాజాగా ఢిల్లీ నుంచి జమ్మూ మార్గంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా నాలుగు రోజుల ప్రయాణ ప్యాకేజీతో సరికొత్త సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఈ క్రమంలో జమ్మూ మెయిల్‌ కు ప్రత్యేక కోచ్ లను అనుసంధానం చేసింది. నిన్న లాంఛనంగా ప్రారంభించిన ఈ విలాసవంతమైన ఏసీ కోచ్ లో పలువురు ప్రయాణించారు. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని ఉండేలా బోగీలోని కంపార్ట్ మెంట్లను డిజైన్ చేయడం విశేషం. ఢిల్లీ నుంచి జమ్మూ వరకు నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రయాణానికి టికెట్ అక్షరాల రెండు లక్షల రూపాయలు కావడం విశేషం. 
Go Back to Shorts
New Delhi
Jammu And Kashmir
Indian railways

More Telugu News