జియో ప్రైమ్ సభ్యులకు గుడ్ న్యూస్.. మరో ఏడాదిపాటు ఉచిత సేవలు

31-03-2018 Sat 06:47
  • నేటితో ముగియనున్న ప్రైమ్ సభ్యత్వం
  • ఉచితంగా మరో ఏడాది పొడిగించిన జియో
  • కొత్త వినియోగదారులు రూ.99 చెల్లించాల్సిందే
సస్పెన్స్‌కు తెరదించుతూ రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిపాటు కొనసాగిన ప్రైమ్ మెంబర్ షిప్ నేటితో ముగియనున్న నేపథ్యంలో సరికొత్త ప్రకటన చేసింది. దీనిని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ప్రైమ్ సభ్యులుగా ఉన్నవారికి ఇది ఉచితం కాగా, కొత్త సభ్యులు రూ.99 చెల్లించి ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.

ప్రైమ్ సభ్యత్వం కలిగిన ఖాతాదారులకు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ పీవీ-19, పీవీ-49, పీవీ-96, రూ.149, పీవీ రూ. 303, పీవీ-351, పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.303, రూ.499, రూ.999 ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే జియో యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం 175 మిలియన్ల మంది జియోకు ఖాతాదారులుగా ఉన్నారు. సాధారణ వినియోగదారులతో పోలిస్తే ప్రైమ్ సభ్యులకు అదనంగా 20 నుంచి 50 శాతం అధిక ప్రయోజనాలు అందించనున్నట్టు జియో పేర్కొంది.