కోపం వచ్చినప్పుడు మా వారు ఎలా ఉండేవారంటే...!: గీతాంజలి
- నాకు వంట చేయడం రాదు
- ఆయన కోసమే నేర్చుకున్నాను
- వంట మనిషితో చేయిస్తే కనిపెట్టేసేవారు
"అలా నా పేరుకు చివరన 'గారు' తగిలించారంటే ఆయనకి కోపం వచ్చిందని అర్థం. ఆ రోజంతా కూడా ఆయన నన్ను అలాగే పిలిచేవారు. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చినా 'గీతాంజలి గారు .. మీ కోసం ఎవరో వచ్చారు' అని చెప్పేవారు. నాకు వంట చేయడం రాదు .. అయితే, ఆయన కోసమని ఆయనకి ఇష్టమైనవి చేయడం మా మేనత్తల దగ్గర నేర్చుకున్నాను. ఒక్కరోజు వంటమనిషితో చేయించినా వెంటనే కనిపెట్టేసి 'గీతాంజలి గారు' అంటూ పిలిచేవారు" అంటూ నవ్వేశారు.