nithin: అందుకే ఆ భారీ సినిమా వదులుకున్నా!: నితిన్

  • విక్రమ్ సినిమా కోసం నన్ను అడిగారు 
  • అమెరికాలోనే ఎక్కువభాగం షూటింగ్ 
  • అందువల్లనే వదులుకున్నాను

రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై విక్రమ్ హీరోగా ఒక భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి కమలహాసన్ సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో .. రాజేశ్ సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నితిన్ నటించే ఛాన్స్ ఉందంటూ కొన్ని రోజుల క్రితం ఒకవార్త షికారు చేసింది. అందులో నిజం లేదని అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి తనకి ఆఫర్ వచ్చిన మాట నిజమేనని తాజాగా నితిన్ చెప్పాడు.

 "ఈ సినిమాలో విక్రమ్ తో సమానమైన ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం నన్ను అడిగారు. ఈ సినిమా షూటింగ్ 45 రోజుల పాటు అమెరికాలో కంటిన్యూగా జరుగుతుందని అన్నారు. అయితే అప్పటికే నేను 'శ్రీనివాస కల్యాణం' .. 'దాగుడుమూతలు' సినిమాలు ఒప్పేసుకుని వున్నాను. అందువలన ఆ సినిమా చేయలేనని చెప్పాను. విక్రమ్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ ను వదులుకోవడం బాధగానే వుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News