IPL: ధోనీ నోటి నుంచి రజనీకాంత్ డైలాగ్... ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదట!

  • తిరిగి ఐపీఎల్ లోకి చెన్నై సూపర్ కింగ్స్
  • 'కాలా' టీజర్ లోని రజనీ డైలాగును డబ్ స్మాష్ చేసిన ధోనీ
  • ఫ్యాన్స్ ఆనందం
రెండు సంవత్సరాల నిషేధం తరువాత, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ తిరిగి ఆడనుండటం, తమకెంతో ఇష్టమైన మహేంద్ర సింగ్ ధోనీయే కెప్టెన్ గా ఉండటం, తమిళ తంబీల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుండగా, ధోనీ సైతం తమిళనాడులో ఐపీఎల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. గతంలో తమిళ సంస్కృతికి అద్దం పట్టేలా పంచె కట్టుకుని విజిలేస్తూ, డైలాగులు వేసిన ధోనీ, ఇప్పుడు 'కాలా'  టీజర్ లో రజనీకాంత్ చెప్పిన డైలాగులను డబ్ స్మాష్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేయగా, ఇప్పుడది హల్ చల్ చేస్తోంది. తమ అభిమాన సూపర్ స్టార్ డైలాగ్, అభిమాన ఆటగాడి నోటి నుంచి వింటున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల హంగామా అంతాఇంతా కాదట.
IPL
Chennai Super Kings
MS Dhoni
Rajanikant

More Telugu News