Ramcharan: 'రంగస్థలం' చూసిన అభిమానుల తొలి టాక్ ఇది!

  • యూఎస్, యూరప్ దేశాల్లో పూర్తయిన షో
  • పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తున్న అభిమానులు
  • కథ పాతదే అయినా, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ
  • ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్సంటున్న ఫ్యాన్స్
తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై మరికాసేపట్లో ప్రదర్శించనున్న రామ్ చరణ్ కొత్త సినిమా 'రంగస్థలం' ప్రీమియర్ షోలు యూఎస్, లండన్ లలో ముగిశాయి. సినిమా చూసిన వాళ్లు పాజిటివ్ వ్యాఖ్యలను చేస్తున్నారు. రామ్ చరణ్ నటన అద్భుతమని కితాబిస్తున్నారు. సమంత మంచి నటనను కనబరిచిందని చెబుతున్నారు. కథ పాతదే అయినప్పటికీ, సుకుమార్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని అంటున్నారు.

తొలి సగభాగం బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ సూపరని, ఆపై సినిమాను కొద్దిగా లాగినట్టు కనిపించినా, 'జిగేల్ రాణి' పాత్ర, ఆపై ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని పలువురు ట్వీట్లు పెడుతున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎం (నేపథ్య సంగీతం) అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే, సినిమా నిడివి చాలా అధికంగా ఉందని అత్యధికులు చెబుతుండటం గమనార్హం.
Ramcharan
Rangasthalam
Twitter
Fans

More Telugu News