Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న పవన్ కల్యాణ్?

  • చిక్ బళాపూర్, బళ్లారి ప్రాంతాల్లో పవన్ సన్నిహితులు
  • స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలు
  • పవన్ వారి తరపున ప్రచారం చేస్తారా? 
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీ తరపున పవన్ ప్రచారం చేస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎందుకంటే, బీజేపీ, టీడీపీ తరపున ప్రచారం చేసే అవకాశాలు లేవు. పవన్ తో కర్ణాటకలోని జేడీఎస్ ( జనతా దళ్ సెక్యులర్) పార్టీ  ఇటీవల సంప్రదింపులు జరిపినట్టు, ఆయనతో ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత కుమారస్వామి ప్రకటించారు.

అయితే, బీజేపీ, కాంగ్రెస్ సహా జేడీఎస్ తరపున కూడా పవన్ ప్రచారం చేయరని తెలుస్తోంది. మరి ఎవరి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే విషయం ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చిక్ బళాపూర్, బళ్లారి ప్రాంతాల్లో పవన్ సన్నిహితులు ఉన్నారని, స్వతంత్ర అభ్యర్థులుగా వారు బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఆయా ప్రాంతాల్లో తన సన్నిహితుల తరపున పవన్ ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.
Karnataka
Pawan Kalyan

More Telugu News