Chandrababu: చంద్రబాబుపై ఎవరు పోరాడినా ఓడిపోతారు: మంత్రి ప్రత్తిపాటి

  • రాష్ట్రం కోసం పోరాడుతున్న బాబుకు అడ్డు తగలాలని చూస్తే ఓడిపోతారు
  • విపక్షాల తీరు సబబుగా లేదు
  • లాలూచీ పడ్డ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు 
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సీఎం చంద్రబాబుకు అడ్డుతగలాలని, ఆయనపై   పోరాడాలని ఎవరైనా చూస్తే వారు ఓడిపోతారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంపై పోరాడుతున్న చంద్రబాబు కాళ్లు లాగే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంతో లాలూచీ పడ్డ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, నాడు చేసిన వాగ్దానాలను మోదీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.
Chandrababu
prathipati

More Telugu News