మీడియా సమావేశంలో స్మిత్ కంటతడి!
- బాల్ ట్యాంపరింగ్‌కు పూర్తిగా నాదే బాధ్యత
- ఈ తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది
- మళ్లీ త్వరగా మైదానంలో అడుగుపెట్టాలనుకుంటున్నా
ఈ సందర్భంగా అతను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు. "నాకు జరిగిన ఈ నష్టం వల్ల ఏదైనా లాభం ఉందంటే...అది ఇతరులకు ఈ ఉదంతం గుణపాఠం కావడమే. ఈ పరిణామం క్రీడా వ్యవస్థలో ఓ మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెటే నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నా" అంటూ స్మిత్ కన్నీటిపర్యంతమయ్యాడు.