Suneel: త్రివిక్రమ్ సినిమాలో సునీల్ రోల్ ఏంటో తెలిసిపోయింది....!

  • త్రివిక్రమ్ సినిమాలో సెక్యూరిటీ ఆఫీసర్‌ పాత్రలో సునీల్
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్
  • హీరోయిన్‌గా పూజాహెగ్డే...సంగీతం థమన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కమెడియన్ సునీల్ ఏ పాత్ర చేయనున్నాడో తెలిసిపోయింది...! ఇందులో సునీల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర ఏంటనేది తాజాగా బహిర్గతమయింది. ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా సునీల్ నటించనున్నాడట.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. కాగా, 'అజ్ఞాతవాసి' చిత్రం తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులోని పాత్రల డిజైన్‌పై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఈ మధ్యకాలంలో చేసిన దాదాపు నాలుగైదు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ కామెడీ పాత్రలనే అతను నమ్ముకున్నాడు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే.

More Telugu News