silvester stalon: సల్మాన్ ఫొటోకి బదులుగా బాబీడియోల్ ఫొటో పోస్టు చేసి, శుభాకాంక్షలు చెప్పిన హాలీవుడ్ యాక్షన్ హీరో!

  • బాబీడియోల్ ను సల్మాన్ గా పేర్కొన్న సిల్వెస్టర్ స్టాలోన్
  • నెటిజన్ల విమర్శల పాలైన హాలీవుడ్ నటుడు 
  • రెండోసారి సల్మాన్ ఫొటో పోస్టు చేసిన స్టాలోన్

బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్ ను పొరపాటున సల్మాన్‌ ఖాన్‌ గా పేర్కొని ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ విమర్శలపాలయ్యాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం ఆరంభించడంతో తప్పును సరిదిద్దుకున్నాడు. దాని వివరాల్లోకి వెళ్తే... సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో ‘రేస్‌ 3’ సినిమా తెరకెక్కుతోంది. దీనిని పురస్కరించుకుని స్టాలోన్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

అయితే సల్మాన్ కు బదులుగా బాబీడియోల్ ఫొటోను పెట్టాడు. దీంతో నెటిజన్లు ఆయనను విమర్శించడం మొదలు పెట్టారు. పొరపాటు తెలుసుకున్న స్టాలోన్ దానిని డిలీట్ చేసి... సల్మాన్‌ ఖాన్‌ ఫొటో పోస్ట్‌ చేస్తూ ‘ఓకే, మళ్లీ మరోసారి ప్రయత్నిద్దాం. ఎంతో ప్రతిభావంతుడైన సల్మాన్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘రేస్‌ 3’ విజయం సాధించాలి. గుడ్‌ లక్‌. (ఒకవేళ ఇది కూడా తప్పు అయితే నేను ఓడినట్లే)’ అంటూ సరదాగా పేర్కొన్నాడు.

 కాగా, 'రేస్', 'రేస్ 2' ల్లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించగా, పార్ట్ 3లో సల్మాన్ నటించనున్నాడు. ఈ సినిమాకి రెమో డిసౌజా దర్శకత్వం వహించనున్నాడు. 

More Telugu News