విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలపై శాసనసభలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగం!
- ప్రధాని కాళ్లు మొక్కి బయటకు వచ్చి.. నాపై అటువంటి వ్యాఖ్యలు చేశారు
- 'తల్లి, తండ్రికీ పుట్టిన వాడైతే'... అంటూ మాట్లాడారు
- చెప్పుకోలేని పదాలతో విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు
- రాజకీయాల్లో నేను 40 ఏళ్లుగా హుందాగా వ్యవహరిస్తున్నా
చెప్పుకోలేని పదాలతో విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారని, రాజకీయాల్లో తాను 40 ఏళ్లుగా హుందాగా వ్యవహరిస్తున్నానని, తాను వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఒక్క మాటా అనలేదని చెప్పారు. తనకు రాజకీయం ముఖ్యం కాదని, ఎవరిపైనా కోపం లేదని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం తాను కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటానికి ఐదుకోట్ల మంది మద్దతు తెలపాలని కోరారు.