ఇది సిగ్గుచేటు.. ఎయిరిండియా అసమర్థత: హీరోయిన్ అదితి రావ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇది సిగ్గుచేటు.. ఎయిరిండియా అసమర్థత: హీరోయిన్ అదితి రావ్‌

  • 15 మంది ప్రయాణికులు విమానం ఎక్కారు
  • ఓవర్‌లోడ్‌ అయిపోయిందని ఎయిరిండియా సిబ్బంది చెప్పారు
  • ఒక్క బ్యాగ్‌ కూడా విమానంలో పెట్టనివ్వలేదు
  • ఇంత జరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదు
ప్రముఖ బాలీవుడ్‌ నటి అదితి రావ్‌ హైదరి ఎయిరిండియా విమాన‌యాన సంస్థ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 15 మంది ప్రయాణికులు విమానం ఎక్కగానే ఓవర్‌లోడ్‌ అయిపోయిందని సిబ్బంది చెప్పారని, ఒక్క బ్యాగ్‌ను కూడా విమానంలో పెట్టనివ్వలేదని ఆమె ట్విట్ట‌ర్ లో పేర్కొంది. ఇది సిగ్గుచేట‌ని, ఎయిరిండియా అసమర్థత అని, ఇంత జరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదని ఆమె మండిప‌డింది. అదితి రావ్ ట్వీట్ పై స్పందించిన ఎయిరిండియా ఆమెకు క్షమాపణ చెప్పి, వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది.

దీంతో స‌ద‌రు న‌టి మ‌ళ్లీ ట్వీట్ చేస్తూ.. ముందు ఎయిరిండియా అధికారులు ఒక విషయం తెలుసుకోవాల‌ని, 15 మంది ప్రయాణికుల నుంచి అధిక లగేజీని తీసుకున్నారని, లోడ్‌ ఎక్కువైందని చెప్పకుండానే తమ లగేజీ దించేశారని అందులో మ‌ళ్లీ చెప్పింది. తాను ఎక్కిన విమానం నంబర్‌ 91807 అని త‌మ‌కు వేరే పనులు, ప్రయాణించడానికి ఇతర ఫ్లైట్లు ఉన్నాయని, ఇంతకుమించి ఇంకేం చెప్పలేమ‌ని ట్వీట్ చేసింది. 
air india
aditi rao
angry

More Telugu News