Nirav Modi: నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు

  • ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యూయార్క్ కోర్టు
  • రూ. 130 కోట్లు ఎగవేసిన కేసులో తీర్పు
  • పిటిషన్ దాఖలు చేసిన ఇజ్రాయెల్ డిస్కౌంట్ బ్యాంకులు

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేలాది కోట్లు అప్పులు తీసుకుని, అమెరికాకు ఎగిరిపోయిన నగల వ్యాపారి నీరవ్ మోదీకి అమెరికన్ కోర్టు షాక్ ఇచ్చింది. అమెరికాలో మోదీకి ఉన్న ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, హెచ్ఎస్బీసీ యూఎస్ఏ, న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఇజ్రాయెల్ డిస్కౌంట్ బ్యాంకులకు రూ. 130 కోట్లు ఎగవేసిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

 కోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే నెల 24న వేలం జరగనుంది. ఫిబ్రవరి 26న నీరవ్ మోదీపై న్యూయార్క్ కోర్టులో ఆ రెండు బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు... ఆస్తుల వేలానికి ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా న్యూయార్క్ కోర్టులో మోదీపై పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చినప్పటికీ... బ్యాంకు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

More Telugu News