క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై వృద్ధ ప్రయాణికుడి లైంగిక వేధింపులు... అరెస్ట్
- ఈ నెల 24న జరిగిన ఘటన
- లక్నో నుంచి ఢిల్లీకి చేరిన తర్వాత విమానంలో వేధింపులు
- ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు, ప్రయాణికుడి అరెస్ట్
దీనిపై ఎయిర్ విస్తారా ఓ ప్రకటన విడుదల చేసింది. అసభ్యకర, వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులను ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించింది. ఈ రకమైన ప్రవర్తన తమ సిబ్బంది భద్రత, తోటి ప్రయాణికులకు రిస్క్ అని, వారి గౌరవం విషయంలో రాజీ పడేది లేదంటూ ఎయిర్ విస్తారా స్పష్టం చేసింది.