సేమ్ సీన్... సుమిత్రా మహాజన్ వెంట అదే డైలాగ్!
- చర్చకు రాని అవిశ్వాస తీర్మానం
- వెల్ ను వదిలిపెట్టని అన్నాడీఎంకే సభ్యులు
- చర్చించే పరిస్థితి లేదన్న స్పీకర్
- ఏప్రిల్ 2కు సభ వాయిదా
తనకు తోట నరసింహం, అసదుద్దీన్ ఒవైసీ, మల్లికార్జున ఖర్గే వంటి వారు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు అందాయని, వాటికి మద్దతిస్తున్న సభ్యుల సంఖ్య లెక్కించలేని పరిస్థితి నెలకొని ఉన్నందున, తన ముందు సభను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదని, గత ఏడు సెషన్లుగా చెబుతున్న మాటలే చెబుతూ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.