akhil: ఈ సారి అఖిల్ మూవీలో చేసేది కొత్త హీరోయిన్ కాదట!

  • వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ 
  • అఖిల్ కి కలిసిరాని కొత్త హీరోయిన్లు 
  • క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్స్ పై దృష్టి

అఖిల్ మూడవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరిని వరించనుందా? అనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. ప్రస్తుతం ఇక్కడ మంచి క్రేజ్ లో వున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

అఖిల్ మొదటి సినిమా ద్వారా తెలుగు తెరకి సాయేషా సైగల్ పరిచయమైంది. రెండవ సినిమా ద్వారా కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. అయితే ఈ రెండు సినిమాలకి కూడా కథానాయికలు ప్లస్ కాలేకపోయారు. అందువలన ఈ సారి కొత్త కథానాయికల జోలికి వెళ్లకుండా, ఆల్రెడీ యూత్ లో మంచి క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్ ను తీసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో వెంకీ అట్లూరి వున్నాడట. అదే విషయాన్ని ఆయన నాగార్జునతోను చెప్పాడని అంటున్నారు. ఇక ఈ సారి అఖిల్ జోడీగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.      

More Telugu News