dileep: సైనికుడి పాత్రలో సిద్ధార్థ్ .. ఈ మూవీపైనే ఆశలు

  • మలయాళ మూవీలో సిద్ధార్థ్ 
  • యథార్థ సంఘటనల ఆధారంగా కథ
  • ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు  

తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' .. 'బొమ్మరిల్లు' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ , ఇక్కడ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తమిళంలోను తనదైన శైలిని అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సక్సెస్ లను అందుకున్నాడు. హిందీ ప్రేక్షకులకు కూడా సిద్ధార్థ్ బాగానే తెలుసు. అలాంటి సిద్ధార్థ్ మొదటిసారిగా 'కమార సంభవం' అనే మలయాళ సినిమా చేశాడు.

 కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దిలీప్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, సైనికుడిగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. రితీష్ అంబట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని సిద్ధార్థ్ అంటున్నాడు. ఈ సినిమా కోసం తాను మలయాళం నేర్చుకోవడం కూడా తనకి బాగా కలిసొచ్చే అంశమనీ .. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

More Telugu News