బంతి తగలడంతో మైదానంలో కుప్పకూలిన ఆటగాడు... విషాదంలో రెండు జట్ల క్రీడాకారులు
- క్రొయేషియన్ థర్డ్ డివిజన్ ఫుట్ బాల్ లీగ్ లో కుప్పకూలిన బ్రూనో బోడన్
- బంతి ఛాతీని బలంగా తాకిన సమయంలోనే గుండెపోటు
- ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందిన బోడన్
దీంతో రెండడుగులు ముందుకు వేసిన బోడన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో సహచర ఆటగాడు అతనికి సపర్యలు చేసే ప్రయత్నం చేయగా, ఫలితం లేకపోవడంతో ఫిజియో సాయంతో ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. అయితే బంతి అతని ఛాతిని తాకిన సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందని, దీంతో వెంటనే బోడన్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో మైదానంలో విషాదం నెలకొంది. బోడన్ మృతి పట్ల క్రొయేషియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.