jagan: మహిళల ఆప్యాయత.. కొబ్బరి బొండం నీళ్లు తాగిన జగన్!

  • నరసరావుపేటలో కొనసాగిన ప్రజా సంకల్పయాత్ర
  • బరంపేటలో జగన్ కు ఘన స్వాగతం పలికిన స్థానికులు
  • జగన్ కు కొబ్బరిబొండాలు ఇచ్చిన మహిళలు
  • శ్రీరామనవమి సందర్భంగా ప్రజా సంకల్పయాత్రకు రేపు విరామం
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 120వ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఈ రోజు ప్రారంభమైంది. బరంపేట, బీసీ కాలనీ, ఇసప్పాలెం, ములకలూరు. గొల్లప్పాడు మీదుగా ముప్పాళ్ల వరకు కొనసాగింది. జగన్ బరంపేటకు చేరుకోగానే స్థానికులు అధిక సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎండ తీవ్రత ఉండటంతో కొందరు మహిళలు ఎంతో ఆప్యాయంగా జగన్ కు కొబ్బరిబొండాలు తాగించారు. కాగా, రేపు శ్రీరామనవమి పర్వదినం కావడంతో జగన్ తన ప్రజా సంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం ఆయన పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుంది.
jagan
YSRCP

More Telugu News