ramprasad: నా పేరు చూసి, నేను ఇంతకుముందు ఆటో నడిపానని అనుకుంటున్నారు: 'జబర్దస్త్' రామ్ ప్రసాద్

  • ముందుగా రోజా అలా అన్నారు
  • అప్పటి నుంచి అందరూ అలాగే పిలుస్తున్నారు 
  • రైల్వే స్టేషన్లో నన్ను చూసిన వాళ్లూ అదే మాట

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన రైటర్లలో .. నటుల్లో రామ్ ప్రసాద్ ఒకరు. తమ టీమ్ చేసే స్కిట్స్ కి ఆయనే స్క్రిప్ట్ రైటర్. మిగతావాళ్లతో కలిసి ఆయన కూడా స్టేజ్ పై నటిస్తుంటాడు. ఆయనని అంతా 'ఆటో' రామ్ ప్రసాద్ అనే పిలుస్తుంటారు. అందుకు కారణమేంటనే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

 అప్పుడాయన స్పందిస్తూ " సందర్భం ఏదైనా నేను సమయాస్ఫూర్తితో పంచ్ లు వేస్తుంటాను. ఆటోమేటిగ్గా ఆ పంచ్ లు పడిపోతూ ఉంటాయి కనుక, ఒకసారి స్టేజ్ పై నన్ను 'ఆటో' రామ్ ప్రసాద్ అంటూ రోజా గారు పిలిచారు. అప్పటి నుంచి నన్ను అంతా 'ఆటో' రామ్ ప్రసాద్ అనే అంటుంటారు. అయితే చాలామంది .. నేను ఈ షో చేయడానికి ముందు 'ఆటో' నడిపానని అనుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నన్ను చూసిన వాళ్లు, 'ఆటో .. ' అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.  

More Telugu News