lalu prasad yadav: దాణా కుంభకోణం .. లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష ఖరారు

  • నాల్గో కేసులో శిక్ష ఖరారు చేసిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు
  • లాలూకు జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా
  • గత డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉన్న లాలూ

దాణా కుంభకోణానికి సంబంధించిన నాల్గో కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు పద్నాలుగేళ్ల జైలు శిక్షను రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు ఖరారు చేసింది. లాలూకు జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.

ఈ కేసుకు సంబంధించి గత సోమవారం తీర్పు వెలువరించింది. దుమ్కా కోశాగారం నుంచి అక్రమంగా రూ. 3.13 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై లాలూతో పాటు మరికొందరిపై ఈ కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.

కాగా, ఇదే కుంభకోణానికి సంబంధించి మిగతా మూడు కేసుల్లోనూ లాలూకు శిక్ష పడిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సా ముండా జైలులో లాలూ శిక్ష అనుభవిస్తున్నారు.

More Telugu News