భార్య కళ్ల ముందే ఆత్మహత్యకు పాల్పడిన భర్త
- నాలుగు నెలల క్రితం లారీలో సామగ్రి లోడ్ చేస్తుండగా కిందపడిన శ్రీనివాసచారి
- వెన్నెముకకు తీవ్రగాయం
- ఇంటికే పరిమితం కావడం పట్ల మనోవేదన
వైద్యుల సూచనతో శ్రీనివాసచారి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత, భార్య ప్రభావతితో వాకింగ్ చేసి వస్తానని చెప్పి తాము నివాసముండే బిల్డింగ్ మూడో అంతస్తుకు వెళ్లాడు. భార్య చూస్తుండగానే ‘ఇక నేను బ్రతకను’ అంటూ అరుస్తూ కిందకి దూకేశాడు. స్థానికుల సాయంతో శ్రీనివాసచారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.