కేంద్రంపై దక్షిణ భారత యుద్ధం.. భేటీకి వెళ్లేందుకు చంద్రబాబు అనుమతి కోరిన యనమల
- దక్షిణాది ఆర్థిక మంత్రుల భేటీకి కేరళ పిలుపు
- భేటీకి అనుమతి కోరిన యనమల
- సుముఖత వ్యక్తం చేసిన చంద్రబాబు
కేరళ ఆర్థిక మంత్రి తనకు ఫొన్ చేశారని ఈ సందర్భంగా చంద్రబాబుకు యనమల చెప్పారు. 2011 జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిందని, ఇదే సమయంలో ఉత్తరాది జనాభా విపరీతంగా పెరిగిపోయిందని.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో జనాభా నియంత్రణ లేని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు.