Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మేకప్ లేకుండా కనిపించనున్న కాజల్
  • ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం పెట్టేశారు 
  • 'రాజుగాడు' డేట్ ఫిక్స్ చేసుకున్నాడు!  

*  అందాల కాజల్ అగర్వాల్ త్వరలో మేకప్ లేకుండా తెరపై కనిపించనుంది. 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్'లో కాజల్ నాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో పాత్ర స్వభావాన్ని బట్టి ఈ ముద్దుగుమ్మ మేకప్ లేకుండా నటిస్తోంది.  
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 12న ప్రారంభించడానికి ముహూర్తాన్ని నిర్ణయించారు.
*  యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడుగా సంజనారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజుగాడు' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అమైరా దస్తర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.  

More Telugu News