Aamir Khan: కృష్ణుడి పాత్రలో ఆమీర్ ఖానా? : ఫ్రెంచ్ కాలమిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • ముస్లిం అయిన ఆయన మహాభారతాన్ని తెరకెక్కించడమేంటి?
  • మహ్మద్ ప్రవక్త పాత్రలో ఓ హిందువు నటిస్తే ఒప్పుకుంటారా?
  • రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఫ్రాంకోయిస్ గ్వాటియర్

మహాభారతంను తెరకెక్కించడానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్న ఈ సినిమాకు నిర్మాతగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యవహరిస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఇందులో కృష్ణుడి పాత్రను ఆమిర్ ఖాన్ పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ముస్లిం అయిన ఆమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించడమేంటి? ఆయన నటించడమేంటి? అని ప్రశ్నించారు. మహ్మద్ ప్రవక్త పాత్రలో ఓ హిందువు నటించేందుకు ముస్లిం మతస్థులు ఒప్పుకుంటారా? అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.

దీనిపై, ప్రముఖ పాటల రచయిత జావేద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. ఫ్రాన్స్ కు చెందిన దర్శకుడు పీటర్ బ్రూక్స్ ‘ది మహాభారత్’ ను తెరకెక్కించలేదా? అని ప్రశ్నించిన ఆయన, ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేయమని ఏ విదేశీ ఏజెన్సీ డబ్బులిస్తోందంటూ ఫ్రాంకోయిస్ పై జావేద్ అక్తర్ మండిపడ్డారు. 

More Telugu News