edida sri ram: చిరంజీవిగారు పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు: ఏడిద శ్రీరామ్

  • నేను హీరోగా 'స్వరకల్పన' చేశాను 
  • అది పరాజయం పాలైంది 
  • బయటికి రావడానికి సిగ్గుపడేవాడిని

అటు వెండి తెరపైనా .. ఇటు బుల్లితెరపైన నటుడిగా ఏడిద శ్రీరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "మా బ్యానర్లో నేను చేసిన 'స్వరకల్పన' అనే సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాపై నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను .. ఇలా జరగడంతో బయటికి రావడానికి నేను సిగ్గుపడేవాడిని.

నేను ఇంట్లో నుంచి బయటికి రావడం లేదనే సంగతి చిరంజీవిగారికి తెలిసింది. అప్పుడాయన నన్ను ఇంటికి పిలిపించారు."ప్లాప్స్ అనేవి ప్రతి ఒక్కరికీ వస్తాయి .. నాకెన్ని రాలేదు? పరాజయాలు ఎదురైనప్పుడు వాటిని ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు వెళ్లాలి. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లూ .. త్వరలో శాటిలైట్ ఛానల్స్ వస్తున్నాయట .. ఆ వైపు నుంచి కూడా మంచి అవకాశాలు ఉంటాయి" అని అయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆ తరువాత టీవీ ఛానల్స్ రావడం .. నేను బిజీ కావడం జరిగిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News